5th class March 10

 ఒక ఊరి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి. కలిసి గడ్డిమేయడం , కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎప్పుడు కలిసి మెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి. కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగవులు నాలుగు వైపులా గడ్డిమెయ్యడానికి వెళ్లాయి ఇదే మంచి సమయం అనుకుని పులి సింహం గడ్డి పొదల్లో దాక్కుని ఒక్కొక్క దాన్ని చంపేసాయి.


నీతి: ఐక్యమత్యమే మహాబలం


1 ప్ర: ఆవులు ఎక్కడ ఉండేవి


2ప్ర: ఆవులు ఎప్పుడూ ఎలా ఉండేవి


ఎవరు ఆవులు జోలికి రాలేకపోయేవి


కొంతకాలానికి ఏం జరిగింది



2. అనగనగా ఒక ఊళ్లో ఒక కుక్క తన ఆరు బుజ్జి కుక్కలతో వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ కాలక్షేమం గడిపేది. ఒకరోజు తన పిల్లలతో తిరుగుతుండగా ఒక బావి కనిపించింది . ఆ బాబిని చూపించి మీరెవ్వరు ఆ బావి దగ్గరకు వెళ్ళకండి చాలా ప్రమాదం ఉంది అని చెప్పింది. ఒకరోజు కుక్కపిల్లలు ఆడుతూ ఆడుతూ ఆ బావి దగ్గరికి వచ్చాయి. వాటిలో ఒక బుజ్జి కుక్క అమ్మ ఎందుకలా చెప్పింది? ఇదేమిటో చూడాలి అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడను చూసి బావిలోపల ఒక కుక్క ఉందని గట్టిగా ఆ కుక్కపై అరవడం మొదలుపెట్టింది.

1. కుక్కకు ఎన్ని బుజ్జి కుక్కలు ఉన్నాయి

2. ఒకరోజు పిల్లలతో తిరుగుతుండగా ఏం చూసింది

3. కుక్క బావిని చూపించి బుజ్జి కుక్కలకు ఏం చెప్పింది

4. బుజ్జి కుక్క బావిలో ఏం చూసింది

5. బావిలోని నీడను చూసి బుజ్జుకుక్క ఏమనుకుంది

Short q/a


అజంత భాష అని తెలుగు భాషకు ఆ పేరు ఎలా వచ్చింది


ల మరియు క ఒత్తుతో వచ్చే పదాలు కొన్ని రాయండి

తరుణి చేత గిరికిలు తిరిగేది ఏమిటి? తీగ మీద పరిగెత్తేది పట్టుకుంటే కరిచేది ఏమిటి?

త్వరగా మరులుము మానుకడుకు గుండె తెచ్చిన నా చెల్లె కొరకు అని ఎవరు ఎవరితో అన్నారు

క్రమబద్ధీకరణ అంటే ఏమిటి

బొమ్మలాటి వారి పేరుతో గల గ్రామం ఏ జిల్లాలో ఉంది

రాయలసీమలో తోలుబొమ్మల ఆటలు ఆడించే వారిని ఏమంటారు



0 Comments