కథ :
కాంతార ముగింపు దగ్గరే ఈ కథ మొదలైంది. పంజుర్లి జాతర తర్వాత అడవిలో మాయమైపోయిన తన తండ్రి గురించి తెలుసుకోవడానికి శివ (చైల్డ్ రిషిబ్ శెట్టి) తాపత్రయపడుతుంటాడు. ఆ మాయం అయ్యే విషయం వెనుక దశాబ్దాల చరిత్ర ఉంటుంది. కాంతార ప్రాంతం చుట్టూ రాజశేఖర్ అనే రాజు రాజ్యం ఉంటుంది. రాజశేఖర్ వంశం ఏలే కాలంలో ఆ అడవి మొత్తం వాళ్ల ఆధీనంలోనే ఉంటుంది. అదే ప్రాంతంలో బర్మ (రిషబ్ శెట్టి) ఉంటాడు. తన ప్రజల కోసం బర్మ ఏకంగా రాజ్యంలోకే వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బర్మ, కనకావతి (రుక్మిణి వసంత్)కి దగ్గర అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?, బర్మ తన కాంతార కోసం ఏం చేశాడు ?, అసలు బర్మ ఎవరు ?, అతను ఎక్కడ నుంచి వచ్చాడు ?, ఈ మధ్యలో కనకావతి పాత్ర ఏమిటి ?, ఆమె టార్గెట్ ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో కూడా కాంతార ఆత్మ సజీవంగా ఉండేలా రిషబ్ శెట్టి తన ప్రతిభను కనబరిచారు. అటు దర్శకుడిగా, ఇటు నటుడిగా రిషబ్ శెట్టి మెప్పించాడు. సాంప్రదాయాలు, సంస్కృతితో ముడిపెట్టి నడిపిన కథనం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన భావోద్వేగాలు కూడా ఆకట్టుకున్నాయి. కీలక సన్నివేశాల్లో రిషిబ్ శెట్టి అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది.
ఈ సినిమా కూడా భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో రిషిబ్ శెట్టి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. రాజుగా జయరాం తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. విలన్ గా నటించిన గుల్షన్ దేవయ్య అద్భుతంగా నటించాడు. ఇక కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్ జీవించింది.
రుక్మిణి వసంత్ స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన రాకేష్ పూజారితో పాటు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. రిషిబ్ శెట్టి కమర్షియల్ మూవీకి అనుగుణంగానే ప్లేను నడుపుతూ.. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను, అలాగే కామెడీ టచ్ ను కూడా సమపాళ్లలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. అదే విధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు.

0 Comments